చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..పవన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ – మంత్రి రజిని

-

చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..పవన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చురకలు అంటించారు మంత్రి రజిని. చంద్రబాబుని చరిత్ర కూడా క్షమించదని మంత్రి రజిని అన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూశారని, ఆయనకు బీసీలు అంటే చిన్న చూపు అని రజిని విమర్శించారు.

మహాసభ వేదికగా ‘ఖబర్దార్’ అంటూ ఆమె చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఫెయిల్యూర్ సీఎం చంద్రబాబు, ఫెయిల్యూర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా, జగన్ ని ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. బీసీ కులాలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాం.. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలోనే తొలిసారి ఏపీలో ఏర్పాటు చేశాం, బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టుమిషన్లు కాదు.. రాజకీయ సాధికారతకు నిదర్శనంగా నిలిచారని రజిని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news