రజనీకాంత్‌ దర్బార్ మూవీ ట్రైలర్ విడుదల

-

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఆయన అగ్ర కథానాయకుడిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. నయనతార కథానాయిక. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. కథానాయకుడు మహేశ్‌బాబు ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. రజనీ తన స్టైల్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌ నిర్మిస్తున్నారు. సునీల్‌ శెట్టి, నివేదా థామస్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news