తెలంగాణ మందుబాబులకు పెద్ద షాకిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల మద్యం ధరలు పది శాతానికి పైగా పెరిగినట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది. పాత మద్యం నిల్వలకు కొత్త ధరలు వర్తంచవని పేర్కొంది.
క్వార్టర్ పై రూ.20, హాఫ్ పై రూ.40, ఫుల్ పై రూ.80, అదే విధంగా బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్టు ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. కాగా, మద్యం ధరల పెంపు నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.400 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.