ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్యసభ సభ్యునిగా ఇళయరాజా ను నియమించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఆరేళ్ల కిందట మోడీ ప్రభుత్వం సుబ్రహ్మణ్యస్వామిని రాజ్యసభకు పంపింది.ఆయన పదవీ కాలం త్వరలో ఆయనముగియనుండటంతో ఆ స్థానంలో ఇప్పుడు ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారు అని వార్తలు వస్తున్నాయి.రాజ్యాంగాధికారమ్ ప్రకారం..సంగీత, సాహిత్య, వైజ్ఞానిక, ఆర్థిక రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను..12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది.
ఆ స్పెషల్ కోటా కిందే తాజాగా ఇళయరాజా పేరును రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇళయరాజా ఇటీవల అంబేద్కర్ -మోదీ పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ..రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు అని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో ఇళయరాజా ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక నియమిస్తున్నారన్న వార్త చర్చనీయాంశమైంది.