అర్ధ నగ్న ప్రదర్శనతో చుక్కలు చూపిస్తున్న రకుల్..!

-

ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే అనుకోకుండా బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ వరుస ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల హిందీలో రెండు సినిమాలను చేస్తున్న ఈమె తాజాగా ఛత్రీవాలీ అనే ఒక బోల్డ్ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటూ ఉండడం గమనార్హం. ఇందులో కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించిన ఈమెకు ఈ సినిమా ద్వారా మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

మరొకవైపు ఈమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జాకీ భాగ్నానితో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రహస్యంగా జరిగిపోతున్నాయని సడన్గా వీళ్ళిద్దరూ పెళ్లి పీటలెక్కి అందర్నీ ఆశ్చర్యపరచబోతున్నారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రేమ బంధాన్ని నిర్భయంగా బయట చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారు.

ప్రస్తుతం అవకాశాలు తగ్గుతున్న సమయంలో మళ్లీ ఆమె సౌత్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ 2 సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈమె మరొక సినిమాలో కూడా అవకాశం దక్కించుకోబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఒకవైపు సినిమాల వేట పడుతూనే మరొకవైపు గ్లామర్ విందు చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా గ్రీన్ కలర్ బికినీ ధరించి బీచ్ లో అర్థనగ్న ప్రదర్శన చేస్తూ వయ్యారాలు పోతుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news