Rakul Preet: చూపులతోనే కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..లెహంగాలో మెరిసిపోతున్న హీరోయిన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తోంది. ‘కొండపొలం’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు చివరగా కనిపించిన ఈ సుందరి..ప్రస్తుతం బీ టౌన్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. ఈ నెల 28న విడుదల కానున్న ‘రన్ వే 34’ ఫిల్మ్ ప్రమోషన్స్ లోనూ ఈ భామ పాల్గొంటోంది.

ఈ సినిమాలో అజయ్ దేవగణ్ నటుడిగా, దర్శకుడిగా వ్యవహరించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, రకుల్ ఆయనతో ఆన్ స్క్రీన్ షేర్ చేసుకుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ‘రన్ వే 34’ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంగతులు పక్కనబెడితే..రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన రకుల్..ఇటీవల వెయిట్ లాస్ అయినట్లు ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది. వైట్ కలర్ లెహంగాలో రకుల్ మెరిసిపోతున్నది.

అలా అందాలను ఆరబోసి చూపులతోనే కైపెక్కిస్తోంది రకుల్. ఈ ఫొటోలకు రకుల్ ‘మీ కలలను ఛేధించండి…వ్యక్తులను కాదు’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలను మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లైక్ చేయగా, నెటిజన్లు ‘వావ్ , బ్యూటిఫుల్, ఎక్సలెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CcxgKWGvIVO/

Read more RELATED
Recommended to you

Latest news