కీర్తి సురేష్ తో చరణ్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్

-

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం గుడ్ లక్ సఖి. ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయనకు నిన్న కరోనా రావడంతో… మెగాస్టార్ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… గుడ్ లక్ సఖి సినిమా దర్శక నిర్మాతలను అభినందించారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కూడా కోరుకున్నారు. అయితే ఆయన మాట్లాడిన అనంతరం ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. అంతేకాదండోయ్.. హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news