న్యూ ఇయర్ రోజు అభిమానులకు శుభవార్త చెప్పబోతున్న రామ్ చరణ్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో #RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు కొన్ని నెలల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి కనీసం టైటిల్ ని కూడా మూవీ మేకర్ ప్రకటించకపోవడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ యూనిట్ పై మండిపడుతున్నారు. ట్విట్టర్లో అయితే చాలాసార్లు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పై నెగటివ్ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండు కూడా చేశారు. ముఖ్యంగా దిల్ రాజు ఈ ట్రెండ్ పై స్పందిస్తూ..” నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను.. కానీ నా చేతుల్లో ఏమీ లేదు.. శంకర్ సార్ మాత్రమే ఖరారు చేయాలి.

కాస్త ఓపిక పట్టండి అప్డేట్ ఇస్తాము “అని దిల్ రాజు చెప్పాడు.. అయితే ఈయన చెప్పి దాదాపుగా 6 నెలలు కావస్తోంది . సోషల్ మీడియాలో లీక్ అయ్యే ఫోటోలతో సరి పెట్టుకోవాల్సి వస్తోంది తప్ప సినిమా నుంచి ఎటువంటి అధికారికంగా ఫస్ట్ లుక్ టైటిల్ కానీ.. పోస్టర్ కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో అసహనం వ్యక్తం చేశారు అభిమానులు. అంతేకాదు అప్డేట్ కోసం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ని ట్యాగ్ చేసి మరి తిడుతున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు వాళ్లను తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

అంతేకాదు ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన న్యూ ఇయర్ రోజు స్వయంగా రామ్ చరణ్ తెలియజేయబోతున్నారట. అలా అభిమానులకు న్యూ ఇయర్ రోజుని తీపి కబురు తో ప్రారంభించబోతున్నాడు రామ్ చరణ్ . ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news