Ram Charan: జై హనుమాన్..రామ్ చరణ్‌ ఫ్రెండ్ అయిపోయిన వానరం..వీడియో వైరల్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన RC15 ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి రామ్ చరణ్ కు సంబంధించిన స్పెషల్ వీడియో షేర్ చేసి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా చిరంజీవి షేర్ చేసిన వీడియోలో రామ్ చరణ్ ‘ఆచార్య’ మూవీ షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్నారు. అంతలోనే ఆయన వద్దకు అనుకోని అతిథి వచ్చారు. సదరు అతిథి ఎవరో కాదు వానరం.. రామ్ చరణ్ చక్కగా మేకప్ వేసుకుంటున్న క్రమంలో ఆయన్నే అలా తథేకంగా చూస్తోంది వానరం.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన వద్ద ఉన్న బిస్కట్స్ కోతికి ఇవ్వగా వాటిని చక్కగా తినేసింది. అలా ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్ – వానరాన్ని చూసి మెగా అభిమానులు , నెటిజన్లు వావ్ అంటున్నారు. చిరంజీవి ఆంజనేయుడి భక్తుడన్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే తన తనయుడి పేరు కూడా రామ్ చరణ్ అని పెట్టారు. అనగా రాముడి చరణాల వద్ద ఉండే హనుమంతుడని అర్థం.

ఈ వీడియో చూసి నెటిజన్లు, మెగా అభిమానులు జై హనుమాన్ అని అంటున్నారు. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో ఓ పాటలో హనుమంతుడి ఆలయం వద్ద ఉండే స్టిల్ ను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, చిరంజీవి ‘జగదేక వీరుడు అతి లోక సుందరి’ చిత్రంలో హనుమాన్ భక్తుడి పాత్రను పోషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మెగా అభిమానులు.

 

Read more RELATED
Recommended to you

Latest news