జీ20 వేదికపై అవకాశం లభించినందుకు ధన్యుడ్ని : రామ్‌ చరణ్‌

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన జీ20 సదస్సులో పాల్గొనడం జరిగింది. జి-20 లో రామ్ చరణ్ యావత్ భారతీయ సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ సదస్సులో రామ్ చరణ్ తన ఆలోచనలను ప్రభావంతమైన రీతిలో తెలియచేశారు. రామ్ చరణ్ ఇటువంటి ఒక గొప్ప ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొనడంపై సోషల్ మీడియాలో తన స్పందన తెలియచేశారు.

Ram Charan Biography: Films, Age, Wife & More

సుసంపన్నమైన రీతిలో వేళ్లూనుకున్న భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలను మన సినిమాల ద్వారా జీ20 వేదికపై చాటిచెప్పే అవకాశం లభించినందుకు ధన్యుడ్ని అయినట్టు భావిస్తున్నానని అన్నారు ఆయన. అందుకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. అందరిని కదిలించగల కంటెంట్ తో విలువైన జీవిత పాఠాలను అందించడంలో భారతీయ సినిమా ప్రత్యేక రమణీయతను కలిగి ఉందని అన్నారు ఆయన. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జీ20 మార్గదర్శకుడు అమితాబ్ కాంత్ లకు ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news