అద్దిరిపోయే న్యూస్: “బోయపాటి – ఉస్తాద్ రామ్”ల మాస్ మూవీ రిలీజ్ డేట్ లాక్!

-

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మాస్ ప్రేక్షకులకు జాతర లాంటి సినిమాలను అందిస్తూ పూనకాలు పుట్తసిత్తో ఉంటాడు. ఇటీవల బోయపాటి తెరకెక్కించిన అఖండ సినిమా ఎన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుందో చూశాము. ఈ సినిమా తర్వాత ఏ హీరోతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాము. అందుకు సమాధానంగా బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్టును ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తో మరో మాస్ సినిమాను మన ముందుకు తీసుకురానున్నాడు.

 

కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేయడం ఇప్పుడు బోయపాటి అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా 23 అక్టోబర్ 2023 వ తేదీన థియేటర్ లలోకి రానుంది. కాగా రామ్ కు ఈ మధ్యన వచ్చిన చిత్రం “ది వారియర్” నిరాశను మిగల్చడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ ను సాధించాలన్న కసితో ఉన్నాడు. మరి చూద్దాం బోయపాటి రామ్ కు హిట్ ను అందించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా ?

Read more RELATED
Recommended to you

Latest news