అఖిల్ “ఏజెంట్” మూవీ నుండి రామ కృష్ణ సాంగ్ ప్రోమో రిలీజ్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాబోతోంది. ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

అలాగే మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు సురేందర్ రెడ్డి. తాజాగా ఈ చిత్రం నుండి రామ కృష్ణ అనే సాంగ్ ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. రామ్ మిరియాల ఆలపించారు. హిప్ హప్ తమీజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి పాట రేపు సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news