పోలీసులు మళ్లీ షాక్.. రామగుండం కమిషనరేట్‌కు పుట్టమధు

-

రామగుండం: పెద్దపల్లి పంచాయతీ ఛైర్మన్ పుట్ట మధుకు పోలీసులు మళ్లీ షాక్ ఇచ్చారు. పుట్ట మధును సోమవారం వదిలేసినట్టే వదిలేసి మంగళవారం మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన రామగుండం కమిషనరేట్‌కు బయల్దేరారు. వామన్ రావు దంపుతల హత్య కేసులో పుట్ట నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 17న ఈ కేసులో పోలీసులు చార్జీషిట్ వేయనున్నారు.

ఈ నేపథ్యలో పుట్టమధు ఎవరూ కనిపించకుండాపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలించారు. చివరకు ఏపీలోని భీమవరంలో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి పుట్టమధును అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు కస్టడీలో తీసుకుని విచారించారు. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని వదిలేశారు. పుట్ట మధు భార్య శైలజాను కూడా విచారించారు. పుట్ట మధు బ్యాంక్ అకౌంట్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

ఇక వామన్‌రావు కేసులో పోలీసుల కీలక ఆధారాలు సేకరించారు. వామన్ రావు దంపతుల హత్య సమయంలో బిట్టు శ్రీను వినియోగించిన కారును పుట్ట మధు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వామన్ రావు దంపతుల హత్యకు ముందు పుట్ట మధు రూ. 2 కోట్లు డ్రా చేసేనట్లు బ్యాంకుల నుంచి ఆధారాలు సేకరించారు. పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు. వామన్ రావు హత్య కేసులో బిట్టు ఏ4గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news