అసలు వేట మొదలైంది.. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ట్రైలర్‌ వచ్చేసింది.

-

కాసేపటి క్రితమే మాస్‌ మహారాజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదలైంది. శనివారం నాడు గ్రాండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. రవితేజ ఈ ట్రైలర్‌లో దుమ్ములేపేశాడు. ధర్మ కోసం డ్యూటీ చేస్తా.. ఇకపై వేట మొదలు అంటూ మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చేలా రవితేజ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ఇక రవితేజ రొమాన్స్, లిప్ లాక్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా మారేట్టు కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో వేణు తొట్టెంపూడికి అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్ గమనిస్తుంటే రవితేజ ఓ క్రైమ్‌ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది.

Ravi Teja Starrer Rama Rao On Duty Trailer raises expectations | మాస్  ట్రైలర్ తో ట్రీట్ ఇచ్చిన రవితేజ.. 'రామా ఆన్ డ్యూటీ' అంటూ రంగంలోకి! News in  Telugu

అయితే ఎమ్మార్వో అయిన రామారావు.. ఈ కిడ్నాప్ కేసుల మీద ఎందుకు ఫోకస్ పెట్టాడు? ఇక సీఐ పాత్రలో వేణు తొట్టెంపూడి చేసే పనులు ఏంటి? అనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే ఈ ట్రైలర్‌లో వేణుకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఒకే ఒక్క డైలాగ్, రెండు మూడు షాట్స్‌లో మాత్రమే ఆయన కనిపించాడు. ఇక హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ అదరగొట్టేశాడు. లిప్ లాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తున్నాయి. ప్రతీ ఫ్రేమ్ కొత్తగా అనిపిస్తోంది. ఇది వరకు ఎన్నడూ చూడనట్టుగా రవితేజ తన ఎనర్జీతో దుమ్ములేపేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news