Ramdhan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో తెలుసా?

-

ముస్లిం సోదరులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ అంటే రంజాన్.. ఈ ఏడాది రంజాన్ మాసం ఈరోజు లేదా రేపు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది.ఈ క్రమంలో ఉపవాస దీక్షల్లో ఎటువంటివి చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

సౌదీ దేశాల్లో ఇవాళ చంద్ర దర్శనమైతే రేపట్నించి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇండియా సహా పొరుగు దేశాల్లో రేపు సాయంత్రం చంద్ర దర్శనమైతే 23వ తేదీ నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. సరిగ్గా 29 రోజుల తరువాత తిరిగి చంద్ర దర్శనంతో రంజాన్ మాసం పూర్తవుతుంది. మరుసటి రోజున ఈదుల్ ఫిత్ర్ పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో రంజాన్ 9వ నెల. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల కావడంతో ఈ నెలకు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో అత్యంత మహత్యం కలిగి ఉంటుంది.

రంజాన్ పవిత్ర నెలలో ఖురాన్ అందించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు మొహమ్మద్ ప్రవక్త ఆచరణ మేరకు ఉపవాసాలుంటారు. ఉపవాస దీక్షలు ఆచరించడం ద్వారా ఆత్మ పరిశుద్ధమై అల్లాహ్ పాపాల్ని క్షమిస్తాడని నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా రంజాన్ నెలలో ఉపవాసాలుంటూ అల్లాహ్‌కు క్షమాపణలు కోరుతారు. సరైన మార్గదర్శనం చూపించమని వేడుకుంటారు. రంజాన్ నెలలో చేసే ప్రార్ధనలకు త్వరగా ఆమోదం పొందుతాయనేది ముస్లింల విశ్వాసం. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకూ నెలంతా కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఈ సమయంలో కనీసం మంచి నీళ్లు కూడా ముట్టరు… నిజంగా ఈ విషయంలో గ్రేట్ అనే చెప్పాలి..

వేసవికాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి.. వేసవిలో 12-13 గంటల ఉపవాసం భారంగా కాకుండా ఉండేందుకు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఫలితంగా శరీరానికి ఎనర్జీ అందుతుంది. వేసవిలో రంజాన్ రావడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, కీరా, టొమాటో వంటి పండ్లను డైట్‌లో చేరుస్తారు. దాహాన్ని పెంచే సాల్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది..

ఈ రంజాన్ ఉపవాసంలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

రంజాన్‌లో ఉపవాసం ఉండేవాళ్లు సాయంత్రం ఇఫ్తార్ తరువాత తిరిగి ఏదైనా తినడం గానీ తాగడం గానీ చేయాలి. కొంతమందికి మాత్రం ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, ప్రయాణాలు చేసేవారికి, గర్భిణీ మహిళలు, రుతుస్రావంలో మహిళలకు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం కొత్త బట్టలు ధరించి నమాజ్ చేయడం ద్వారా ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. ఒకరికొకరు రంజాన్ ముబారక్ లేదా ఈద్ ముబారక్ చెప్పుకుంటారు.. అదండి..

Read more RELATED
Recommended to you

Latest news