2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ పరిస్థితి దినదినగండంగా జరుగుతున్న సంగతి తెలిసిందే! పార్టీ పరిస్థితి మాత్రమే అలా ఉందనుకుంటే పొరపాటే… అధినేత చంద్రబాబు పరిస్థితి మరీ దారుణం. కరోనా రూపంలో చంద్రబాబు రాజకీయం ముగియబోతోందన్న ప్రచారం జరుగుతున్నంతగా పరిస్థితి మారిపోయింది. ప్రజల కంటికి కనిపించి చాలా కాలమే అయ్యింది. పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై జరుగుతున్న కసరత్తులో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని అంటున్నారు!!
ఇప్పటికే ఎవరు ఎప్పుడు సైకిల్ దిగి, ఫ్యాన్ కిందకు చేరిపోతారో తెలియని పరిస్థితి.. అసలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందా ఊడుతుందా అనే టెన్షన్. శాసనమండలి కూడా రద్దయితే చినబాబు జాబు పోతుందనే మరో టెన్షన్! ఒకపక్క గతంలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీలు, అరెస్టులు! వీటన్నింటికీ తోడుగా అందొస్తాడనుకున్న కొడుకు అసమర్ధుడిగా మిగలడం. ఇవి చాలవన్నట్లు బాబుకు కొత్త సమస్య వచ్చి పడిందంట!
పార్టీని కాస్త గాడిలో పెట్టాలని తలచిన బాబు.. పార్టీ కమిటీల్లోకి కొత్త నెత్తురు ఎక్కించి వాటిని క్రియాశీలం చేయాలన్న ఆలోచనలు చేస్తారని అంతా భావించారు. కానీ… మళ్లీ బాబు కొత్త సీసాలో పాత నీరు అన్నట్లుగానే చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. రామ్మోహన్ నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే… కాస్త యువతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది.. పార్టీ కాస్తొ కూస్తో పరుగుపెడుతుందని భావిస్తున్నారు తమ్ముళ్లు!
అయితే బాబు మాత్రం… తనవల్ల అరెస్టయ్యి సుమారు 70రోజులు ఇబ్బందిపడిన అచ్చెన్నను సవరదీసే పనిలో భాగంగా… ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష భాద్యతలు ఇవ్వాలని బాబు బావిస్తున్నారు. ఇది మరో తప్పు చేయడమే అని తమ్ముళ్లు వాపోతున్నారు! దీంతో రామ్మోహన్ నాయుడికి ఆ ఛాన్స్ లేనల్టే అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మరో ఎత్తు వేసిన బాబు…. రామ్మోహన్ నాయుడికి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వాలని బాబు భావించారట. కానీ.. రామ్మోహన్ నాయుడు అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని… నాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవే కావాలని అడగలేకో లేక తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టడం ఇష్టం లేకో కానీ…. తనకు శ్రీకాకుళం లోక్ సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందువల్ల ఈ పదవికి న్యాయం చేయలేనని, మరెవరినైనా పరిశీలించాలని చెప్పి సైడ్ అయిపోతున్నారట.
దీన్నే “రామ్మోహన్ నాయుడు అలిగారు” అని చెబుతున్నారు తమ్ముళ్లు! నిజమే కదా… నిన్నటివరకూ అచ్చెన్నా బయటకు రాడేమో అని రామ్మోహన్ నాయుడుని కూల్ చేయడానికి ఆ ఆఫర్ ప్రకటించిన బాబు… సడన్ గా అచ్చెన్నను సవరదీసేపనిలో భాగంగా రామ్మోహన్ కి దెబ్బకొట్టడం కరెక్ట్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది!!
-CH Raja