రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన తర్వాత కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై సారధి ధోనీ ఏడవ స్థానంలో రావడమే ఇందుకు కారణం. 217పరుగుల లక్ష్యం ఉన్నప్పుడు ధోనీ ఏడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ విమర్శలు చేసారు. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కామెంట్లు చేసాడు.
ఏడవ స్థానంలో బ్యాటింగ్ కి దిగడాన్ని సమర్థించబోనని, ఇది ప్రయోగాలు చేయాల్సిన సమయం కాదని చెబుతున్నాడు. ట్వంటీ ట్వంటీలో చూస్తుండగానే మ్యాచులు చేజారిపోతుంటాయని, చూస్తూ ఉండగానే ఐదు మ్యాచులు ఓడిపోయే పరిస్థితి రావచ్చని, అందువల్ల ప్రతీ మ్యాచు ముఖ్యమేనని, ఇలాంటి వాటిని సమర్థించనని కామెంట్లు చేసాడు.