రష్యాను అడ్డుకునేందుకు పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య ఉక్రెయిన్ నలిగిపోతుంది. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడానికి అత్యవసర పరిస్థితి విధించాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య వివాదం మరింత తీవ్రం కావడంతో ఉక్రెయిన్ పై దండెత్తడానికి రష్యా అన్ని విధాలుగా సిద్ధమయింది.
ఈ మేరకు ఉక్రెయిన్ లో ఉన్న దౌత్య సిబ్బందిని కూడా వెనక్కి రావాలని రష్యా ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని రష్యా రాయబార కార్యాలయం నుండి తరలింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. పైగా కీవ్ లోని ఎంబసీ కార్యాలయం దగ్గర రష్యా జెండా ఎగరడం లేదు అని తెలుస్తోంది. రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా సైనిక చర్యకు సిద్ధంగా ఉంది. అలానే సరిహద్దుల్లో ఎక్స్ట్రా బలగాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్ రష్యా సంక్షోభంపై సైనిక పరిణామాలు వలన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రెండవ అత్యవసర సమావేశానికి మూడు రోజుల్లో సమావేశం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేయడం జరిగింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా ప్రపంచంలో ప్రమాదకరమైన క్షణాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
తూర్పు ఉక్రెయిన్ లో తక్షణం కాల్పుల ఆపాలని ఆయన తెలిపారు అలానే ఈ పరిస్థితి గురించి బ్రీఫింగ్ ఇవ్వాలని ఆయన చెప్పారు. సోమవారం జరిగిన సమావేశం లాగ మళ్లీ జరిగే అత్యవసర సమావేశానికి కూడా ప్రస్తుత భద్రత మండలి అధ్యక్షుడు రష్యాకు అధ్యక్షత వహిస్తారు అని తెలిపారు.