రానా తండ్రి అవుతున్నాడనేది రూమరే..!!

-

రానా దగ్గుబాటి-మిహికా బజాజ్‌ జంట కు 2020 లో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంటకు వారసుడు రాబోతున్నాడు అని రానా భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలలో నిజం లేదని రానా సతీమణి మిహికా తెలియ చేసింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా వుండే మిహీకా తన రీసెంట్  విషయాలను తరుచుగా అభిమానుల తో పంచుకుంటూ వుంటుంది. గతంలో  తన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈనేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోస్ లో ఆమె కొద్దిగా లావు వుండే సరికి , తనని ఫాలో అయ్యే నెటిజన్ మీరు తల్లి కాబోతున్నారాఅని అడిగాడు.

దీనికి ‘నేను ఇంకా హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త బొద్దుగా ఉన్నాను’ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది.దీనితో  రానా భార్య ప్రెగ్నెన్సీ అనే వార్తలు నిజం కావని తెలిసి పోయింది. ప్రస్తుతం రానా హిరణ్య కశిప సినిమా లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news