చలికాలంలో వేడిని పొందేందుకు సహాయపడే ఆహారపదార్ధాలివే..!

-

చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీని వలన మనకి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. పైగా మన శరీరాన్ని వేడిగా మార్చడం చాలా ముఖ్యం. అయితే చలికాలంలో వీటిని తీసుకుంటే వేడి కలుగుతుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పైగా ఉల్లిని తీసుకోవడం వల్ల బాడీ హీట్ అవుతుంది. కాబట్టి చలికాలంలో కచ్చితంగా ఉల్లిపాయని ఎక్కువగా వాడుతూ ఉండండి. దీనితో ఒంట్లో వేడి కలుగుతుంది.

నెయ్యి:

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యిని తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోతాయి అలానే నెయ్యి వలన కాన్స్టిపేషన్ సమస్య ఉండదు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఒంటిని వేడి చేస్తుంది కూడా.

అల్లం:

అల్లం లో చక్కటి గుణాలు ఉంటాయి. మెటాబాలిజంని ఇది బూస్ట్ చేస్తుంది. అలానే బ్లడ్ ఫ్లో ని పెంచుతుంది. పచ్చి అల్లాన్ని వేడి నీళ్లలో వేసుకుని తీసుకుంటే చాలా మంచిది. రెగ్యులర్ టీ లో కూడా మీరు అల్లంను ఉపయోగించవచ్చు.

తేనె:

తేనె ఆరోగ్యనికి చాలా మంచిది ముఖ్యంగా చలికాలంలో జలుబు దగ్గు వంటివి ఉంటాయి అటువంటప్పుడు తేనె తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఆవాలు:

ఆవాలు కూడా ఆరోగ్యానికి మంచిది. ఆవాల నూనె రాసుకుంటే చాలా బాగుంటుంది.

బెల్లం:

బెల్లం కూడా ఒంటిని వేడిగా మారుస్తుంది బెల్లం ఆరోగ్యనికి చాలా మంచిది చక్కటి ప్రయోజనాలు మనం బెల్లం వల్ల పొందొచ్చు. ఇలా చలికాలంలో వీటిని తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news