ఇండియాలో కొత్తగా 11,415 కేసులు..262 రోజుల తర్వాత ఇదే మొదటి సారి

ఇండియా లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,451 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,42,826 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య ఇంత తక్కువ నమోదు కావడం 262 రోజుల తర్వాత ఇదే మొదటి సారి.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.24% శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 266 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,57,740 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,204 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,41,175 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 108. 47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు దేశంలో 61. 60 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.