బాలీవుడ్‌లో హిట్టు మాట వినపడి చాలా కాలమైంది. చిన్న చిత్రాలు మెరవట్లేదు. భారీ బడ్జెట్ చిత్రాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టేశాయి. ఆమీర్, అక్షయ్ వంటి అగ్రతారలు సైతం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయారు. ఈ తరుణంలో విజయమే లక్ష్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగింది ‘బ్రహ్మాస్త్రం’. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రమిది. మూడు భాగాలుగా రూపొందుతోంది. దీన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ముస్తాబైన ఈ సినిమాకు.. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ మెరుపులు తోడవడం.. దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా సమర్పిస్తుండటంతో సినీప్రియుల కళ్లన్నీ ఈ చిత్రంపై పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు.. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. భారీ తారాగణం, బడ్జెట్‌తో.. గ్రాండీయర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో రికార్డు సృష్టించింది.
బ్రహ్మాస్త్ర సినిమా తొలిరోజే దేశవ్యాప్తంగా.. అన్ని భాషల్లో కలుపుకుని 36 కోట్ల రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనాలిస్ట్ రమేశ్ బాలా తెలిపారు. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ఒరిజనల్ హిందీ చిత్రంగా రికార్డులు సృష్టించినట్లు తెలిపాడు.
#Brahmastra Day 1 Early Estimates for All-India Nett for all languages 36 Crs..
A new record for non-holoday for an Original Hindi film..
— Ramesh Bala (@rameshlaus) September 10, 2022
ఇక అటు అమెరికాలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసి బ్రహ్మాస్త్ర రికార్డు సృష్టించిందని వెల్లడించాడు. అమెరికాలో తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా వసూలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు రమేష్ బాలా ట్వీట్ చేశాడు.
At the #USA Box office, #Brahmastra has done more than $1 Million on Day 1..
— Ramesh Bala (@rameshlaus) September 10, 2022
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాలో రియల్ కపూల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కీలక పాత్రలో కనిపించాడు. ఇక తెలుగులో ఈ సినిమా బ్రహ్మాస్త్రంగా వచ్చింది. అంతేకాక దర్శకడు ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది.