భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ కామాంధుల చేతికి చిక్కింది. వారం రోజుల పాటు కామాంధుల చేతిలో దారుణానికి బలైంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ పాట్నాకు చెందిన మహిళ భర్తతో గొడవపడి బయటకు వెళ్లింది. రాత్రి పూట పాట్నా నుంచి కోల్ కతాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే రాత్రి కోల్ కతాకు ఎన్ని గంటలకు రైల్ ఉంటుందని స్థానికంగా ఉన్న హోటల్ ఓనర్ గోపాల్ ను అడిగింది. కాగా హోటర్ ఓనర్ సదరు మహిళ గురించి అమిత్ వ్యక్తికి చెప్పాడు. వీరిద్దరు కలిసి కర్బిగహియా ఏరియాలో ఒక రూం ఏర్పాటు చేసి రైలు వచ్చేవరకు ఇక్కడే ఉండమని సూచించారు. అయితే కొన్నిగంటల తర్వాత వీరిద్దరితో పాటు అమిత్ అనే వ్యక్తి కలిసి సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు వారం రోజుల పాటు గదిలో ఉంచి అత్యాచారం చేశారు. అక్టోబర్ 10 నుంచి 17 వరకు వారం రోజులు గదిలో బందీగా గడిపింది. నిందితులు గది బయటే ఉంటూ ఎవరూ రాకుండా నిఘా ఉండే వారని పోలీసులు వెల్లడించారు.
అయితే భార్య కోల్ కతా చేరకపోవడంతో ఆమె భర్త జక్కన్ పూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళ సెల్ ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. చివరి సారిగా బాధిత మహిళ ఫోన్ పాట్నా జంక్షన్ వద్ద ట్రెస్ కావడంతో పరిసర ప్రాంతాల్లో విచారణ జరిపారు. చివరగా మహిళను బందీగా ఉంచిన గదికి చేరుకుని కామాంధుల చెర నుంచి పోలీసులు ఆమెను రక్షించారు. నిందితుల్లో ఒకరైన గోలును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంలో మిగిలిన నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.