విజయ్ దేవరకొండ – సమంత సినిమాలో మరో టాలీవుడ్ బ్యూటీ !

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న లవ్ స్టోరి ‘‘ఖుషి’’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘హృదయం’ ఫేమ్ అబ్దుల్ వాహిబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


న్యూఏజ్ లవ్ స్టోరిగా ‘ఖుషి’ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ను ఈ ఫిల్మ్ కు పెట్టడం ద్వారా ఈ పిక్చర్ పై అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా, ఈ సినిమా నుంచి ఓ రూమర్‌ వైరల్‌ గా మారింది. ‘‘ఖుషి’’ సినిమాలో.. టాలీవుడ్‌ బ్యూటీ.. రాశిఖన్నా నటిస్తోందని తెలుస్తోంది. సినిమా సెకండాఫ్‌ లో రాశి ఖన్నా ఓ కీలక పాత్రలో కనిపిస్తుందట. అయితే.. దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version