టి20 ప్రపంచ కప్ 2022 లో మ్యాచ్ లు చాలా రసవత్తరంగా మారింది. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు.
ఈ మ్యాచ్ లో బౌండరీ ఆపే ప్రయత్నంలో రషీద్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్ ను వదిలి రషీద్ ఫిజియో సాయంతో బయటకు వెళ్ళాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో మహమ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో రషీద్ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీ లో ఆడిన రెండు మ్యాచ్ లోను ఆఫ్గాన్ ఓటమిపాలైంది. ఆప్గాన్ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక అతను ఆఖరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ నవంబర్ 4న ఆస్ట్రేలియా తో తలపడనుంది.