ప్రముఖ రచయితగా గోపాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పరుచూరి బ్రదర్స్ పేరిట వీరిద్దరూ ఒక సంచలనమే సృష్టించారు. ఫ్యామిలీ, యాక్షన్ , కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు.. కథల ఎంపిక విషయంలో తిరుగుబాటు ఉండదు. ఇప్పుడు కొత్త రైటర్స్ వచ్చిన నేపథ్యంలో వీరి జోరు కాస్త తగ్గింది అయినా కూడా అడపాదడపా వీరు రచయితలుగా సినిమాలకు పనిచేస్తున్నారు.. ఇకపోతే పరుచూరి గోపాలకృష్ణ గత కొద్ది కాలంగా పెద్ద సినిమాలపై రివ్యూ ఇస్తున్నారు. విడుదలైన నెల రోజులకు ఆయన రివ్యూ వస్తుంది. తాజాగా వారసుడు సినిమా రివ్యూ చెప్పారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్న పాత్ర పై ఆయన షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.. రష్మికను పాటలకే పరిమితం చేశారు అని .. హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య లవ్ ట్రాక్ ఇంకా పెట్టాల్సింది.. కానీ చాలా తక్కువ సీన్లకే పరిమితం చేశారు.. సినిమా మైనస్ లో ఇది ముఖ్యమైనది.. రష్మికను పాటల కోసమే ఎక్కువగా వాడుకున్నారు.. నటనకు ప్రయారిటీ ఇవ్వలేదు.. నిడివి కూడా చాలా తక్కువగానే ఉంది.
వారసుడు సినిమాలో వీరిది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.. కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు వంటి వాటికి ప్రయారిటీ ఇచ్చారు. దాన్ని కొంత కట్ చేసి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథకి క్లారిటీ ఇచ్చి ఉండుంటే కచ్చితంగా ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్లి ఉండేది. సినిమాలో తండ్రి పాత్ర చనిపోవడాన్ని చూపించారు. అస్తికలు నదిలో కలిపినట్లు చూపించారు. కానీ ఆ షార్ట్ చూపించకుండా హీరో, హీరోయిన్లకు పెళ్లి చేసి తండ్రి చేత అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది.. అంటూ తెలిపారు. మొత్తానికి అయితే ఆమె పాత్రకు అన్యాయం జరిగింది అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.