గోవిందాతో ‘పుష్ప’ సాంగ్ కు స్టెప్పులేసిన రష్మిక .. వీడియో వైరల్

-

‘గుడ్ బై’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. రష్మిక ‘డాన్స్ ఇండియా డాన్స్’ కార్యక్రమానికి వెళ్లింది. ఆ షో జడ్జ్‌ల‌లో ఒకరు, సీనియర్ హీరో గోవిందాతో కలిసి రష్మిక.. పుష్ప సినిమాలోని స్వామి సాంగ్ కు స్టెప్పులేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పుష్ప సినిమా కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో హిట్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప మేనియా ఇంకా నడుస్తోంది. రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా.. శ్రీవల్లి అంటూ బాలీవుడ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

బాలీవుడ్ లోనూ రష్మిక హవా నడుస్తోంది. ఈమె ఫేం చూసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా షాక్ అవుతున్నారు. రష్మిక మందన్న గుడ్ బై సినిమా అక్టోబర్ 7 థియేటర్ లో విడుదల కానుంది. తొలి సినిమాRతోనే రష్మిక.. అమితాబ్ బచ్చన్, నీనా గుప్త వంటి ప్రముఖ నటులతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news