నల్గొండ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో 90 మంది యువతీయువకులు !

-

నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేగింది. నిన్న రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు చెబుతున్నారు. ఇక ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 90 మంది యువతీ యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాచకొండ పోలీసులు     ని భగ్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల దాడి నేపథ్యంలో పదిమంది యువకులు పరారైనట్లు చెబుతున్నారు. ఇక పట్టుబడిన 90 మంది యువతీ యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి 20 కార్లు 60కి పైగా బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. నగరాల్లో వీక్ ఎండ్ వస్తే చాలు కుర్రకారు ఎక్కడో అక్కడ రేవ్ పార్టీలో ఎంజాయ్ మెంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి అయిన ఈ రేవ్ కల్చర్ మన భారతదేశంలో యువతను పెడద్రోవ పట్టిస్తోంది.  

Read more RELATED
Recommended to you

Latest news