రవితేజతో నిఖిల్ హీరోయిన్ రొమాన్స్ !

-

మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మూవీలో తన నటనతో కుర్రకారు మనసు దోచేసింది అందాల సుందరి అనుపమా పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘అ..ఆ..’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ భామ ఇటీవల నటించిన కార్తికేయ-2 గ్రాండ్ సక్సెస్ అయింది.

కార్తికేయ 2 సూపర్ సక్సెస్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ సినిమా ఆమెకు అనేక ఆఫర్లతో పరిశ్రమలో కొత్త అదృష్టాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పాలి. తాజా అప్ డేట్ ప్రకారం, అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రంలో మాస్ మహారాజా రవితేజ తో రొమాన్స్ చేయడానికి ఎంపికైంది.

కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని రవితేజతో ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని, ఈ సినిమా కోసం అనుపమ చర్చలు జరుపుతోందని సమాచారం. అనుపమ రౌడీ బాయ్స్ తో ఒక రకమైన మేకవర్ చేసి తన లిప్ లాక్ తో వార్తల్లో నిలిచింది. ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరియు మరింత గ్లామర్ పాత్రలు చేయాలని చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news