పడుకున్న వెంటనే నిద్రపోవడం అంటే అంత ఈజీ కాదు.. ఈరోజుల్లో చాలా మంది.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్ర అనేది ప్రశాంత వాతావరణంలో.. అంతకంటే.. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది..ఏవేవో కారణాల వల్ల మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది.. మన చేతుల్లో లేని వాటి గురించి మనం తెగ థింక్ చేస్తుంటాం.. వీటన్నింటి వల్ల రాత్రి త్వరగా నిద్రపట్టదు..మన రోజూవారి జీవితంలో మన పనులకు ఎలా సమయాన్ని కేటాయిస్తామో.. నిద్ర పోవడానికి కూడా సమయాన్ని అదే విధంగా కేటాయించాలని చెబుతున్నారు.
మనం రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి.. అప్పుడే మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పడుకోగానే నిద్ర రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అనే పరిస్థితికి వచ్చేశాం.. కారణాలు ఏమైనప్పటికీ మన శరీరానికి తగినంత నిద్ర చాలా అవసరం. కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు. చక్కగా నిద్రపోవడానికి ఉపయోగపడే చిట్కాలు ఇవే..
మనలో చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అతిగా వీటిని తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. వీటిని తాగడం సాధ్యమైనంత వరకు తగ్గించండి.. వీలైతే మానేయండి.. మరీ మంచిది…
శరీరానికి తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల కూడా నిద్ర తొందరగా పడుతుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టాలంటే ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నిద్రించకూడదు. శరీరం తేలికై నిద్ర సులువుగా పట్టడంలో ప్రాణాయామం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పడుకునే ముందు ప్రాణాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
చక్కని సంగీతాన్ని వింటూ ఉంటే కూడా చాలా సులువుగా నిద్రలోకి జారుకుంటారు.
మానసిక ఒత్తిడి కారణంగా కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర సులువుగా పడుతుంది.
గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరిగి చక్కగా నిద్రపోతారు. అందుకే మనకు ఆయిల్ పెట్టుకోగానే నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది.
సాయంత్రం సమయంలో అతిగా భోజనం చేయడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. సాయంత్రం భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
అదే విధంగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. స్లీపింగ్ సైకిల్ అనేది చాలా ముఖ్యం.. అలాగే నిద్ర మేల్కొనే సమయం కూడా ఒకటే ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి చక్కని నిద్రను సొంతం చేసుకోవచ్చు.
పడుకున్న వెంటనే నిద్ర పోవాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..!!
చక్కని సంగీతాన్ని వింటూ ఉంటే కూడా చాలా సులువుగా నిద్రలోకి జారుకుంటారు.
టీ, కాఫీలను నైట్ టైమ్ తాగడం మానేయండి.
పడుకునే ముందు ప్రాణాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
సాయంత్రం భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరిగి చక్కగా నిద్రపోతారు.