ఏపీ సీఎం జగన్ పై CSK ప్లేయర్ రాయుడు కామెంట్స్ !

-

మాజీ ఇండియా ఆటగాడు మరియు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు. తాజాగా రాయుడు వార్తల్లో నిలవడం విశేషం. గత కొంతకాలంగా రాయుడు క్రికెట్ ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అంబటి రాయుడు ఏమీ స్పదించకపోవడంతో క్లారిటీ ఏమీ రాలేదు. కానీ తాజాగా ఒక రాయుడు చేసిన ఒక ట్వీట్ మాత్రం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడిన ఒక వీడియోను వైసీపీ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ ట్వీట్ ను రాయుడు రీ ట్వీట్ చేసి ఒక మెసేజ్ ను యాడ్ చేయడం గమనార్హం. రాయుడు ఈ ట్వీట్ లో …. గ్రేట్ స్పీచ్ .. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మీపై పూర్తి నమ్మకం ఉంది జగన్ సార్ అని పెట్టారు. ఈ ఒక్క మెసేజ్ తో రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఏపీలో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news