తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు..!

-

మన రాష్ట్రము లో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి చాల ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దాంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక తెలంగాణలో బుధవారం పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.5 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Weather Report | దంచికొడుతున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు..!

తలమడుగు (ఆదిలాబాద్‌) 44.3, కీతవారిగూడెం (సూర్యాపేట) 44.2, వెల్గటూరు (జగిత్యాల) 44.2, కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌) 44, తాడ్వాయి (ములుగు) 44, గరిమెల్లపాడు (భద్రాద్రి కొత్తగూడెం), 44, కొమ్మెర (మంచిర్యాల) 43.9, చప్రాలా (ఆదిలాబాద్‌) 43.9, భిక్కనూర్‌ (కామారెడ్డి) 43.8, పజ్జూర్‌ (నల్లగొండ) 43.8, ధర్మసాగర్‌ (హన్మకొండ) 43.8, జైనత్‌ (ఆదిలాబాద్‌) 43.7, పాత కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, సుజాతనగర్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, కొండాపూర్‌ (మంచిర్యాల) 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అలాగే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news