ఇస్రో మరో కీలక ప్రయోగం… కౌంట్ డౌన్ స్టార్ట్‌

ఇస్రో మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. ఈ సారి ఇస్రో పీఎస్ఎల్‌వీ – సీ 47 కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మంగ‌ళవారం ఉద‌యం ప్రారంబ‌మైన ఈ కౌంట్‌డౌన్ మొత్తం 26 గంట‌ల పాటు కొన‌సాగ‌నుంది. ఈ పీఎస్ఎల్‌వీ సీ 47 ఉప‌గ్ర‌హం బుధ‌వారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ మొత్తం 14 ఉప గ్ర‌హాల‌ను నింగిలోకి మోసుకు వెళుతుంది.

కార్టోశాట్-3తో పాటూ అమెరికాకు చెందిన ఉపగ్రహాలను.. పీఎస్‌ఎల్వీ-సీ 47 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇస్రో పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ఈ కార్టోశాట్ 3ని రూపొందించింది. ఈ కార్టోశాట్ 3 జీవిత కాలం ఐదేళ్లు. దీని బరువు 1625 కిలోలు.. ఉపగ్రహం తయారీకి రూ.350 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ పీఎస్ఎల్‌వీ సీ 47ను ప్ర‌యోగిస్తోన్న నేప‌థ్యంలో ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఇప్ప‌టికే ఇస్రో స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌త‌ను మ‌రింత స్ట్రాంగ్ చేశారు. ఒక‌వేళ పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావ‌రాల‌పై మెరుపు దాడుల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రీశాట్ శ్రేణికి మించిన సామ‌ర్థ్యం కూడా ఈ ఉప‌గ్ర‌హాల‌కు ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ఇస్రో స్ప‌ష్టం చేసింది. ఇక మూడో త‌రం ఉప‌గ్ర‌హంగా అంద‌రూ భావిస్తోన్న ఈ కార్టోశాట్ 3 25 సెంటీమీట‌ర్ల హై రిజ‌ల్యూష‌న్‌తో ఫొటోలు తీయ‌డంతో పాటు సైనిక‌, ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను సైతం మ‌రింత స్ప‌ష్టంగా చూపిస్తుంది.

ఈ ఉపగ్ర‌హానికి భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సూర్యుని స్థిర కక్ష్యలోకి పంపుతారు.