రియ‌ల్‌మి నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కే సి12, సి15 స్మార్ట్ ఫోన్లు..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త్‌లో సి12, సి15 పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రియ‌ల్‌మి సి12 ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ ఉన్న డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ఉంది. వెనుక వైపు 13, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో అందిస్తున్నారు.

Realme C12 and Realme C15  smart phones launched in india

రియ‌ల్ మి సి12 స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్
* 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి సి12 ప‌వ‌ర్ బ్లూ, ప‌వ‌ర్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.8,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగ‌స్టు 24 నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు.

ఇక రియ‌ల్‌మి సి15 స్మార్ట్ ఫోన్‌లోనూ 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులోనూ ఆండ్రాయిడ్ 10 ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక వైపు 13, 8, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు 4 ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇందులోనూ 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో అందిస్తున్నారు.

రియ‌ల్‌మి సి15 స్పెసిఫికేష‌న్లు…

* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్‌ ప్రొటెక్ష‌న్, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్
* 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10ఓఎస్‌, 13, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి సి15 స్మార్ట్‌ఫోన్ ప‌వ‌ర్ బ్లూ, ప‌వ‌ర్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.9,999గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999గా ఉంది. వీటిని ఆగ‌స్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news