ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా పొరపాటున ఇంకొకరికి డబ్బులు పంపేసారా..? అయితే ఇలా వెనక్కి తెచ్చుకోండి..!

-

ఈ మధ్యన క్యాష్ పేమెంట్స్ బాగా తగ్గిపోయాయి. ఈజీగా ఎవరికైనా డబ్బులని పంపిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లి లైన్ లో నిలబడే అవసరం కూడా ఈరోజుల్లో లేదు. బ్యాంకు ఖాతాకు మొబైల్‌ నెంబర్‌ లింక్ అయ్యి ఉంటే చాలు ఎవరికైనా మనీ పంపేయచ్చు. లేదంటే యాప్‌ యూపీఐ ఐడి తెలిసినా చాలు. అయితే ఒక్కోసారి ఇలా పేమెంట్స్ చేస్తున్నప్పుడు పొరపాట్లు కూడా వస్తూ ఉంటాయి.

ముఖ్యంగా ఒక నెంబర్‌కు బదులు మరొక నెంబర్ ని ఎంటర్ చేసి డబ్బులని పంపుతున్నారు. అయితే మీకు కూడా ఇలాంటి పొరపాటు జరిగితే ఆ డబ్బులని ఈ విధంగా పొందొచ్చు. ఒక యూపీఐ ఐడికి బదులు మీరు మరో యూపిఐ ఐడికి పొరపాటున డబ్బులు పంపిస్తే వాటిని మీరు ఈ విధంగా తిరిగి పొందొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అనుకోకుండా మీరు ఒకరికి పంపబోయి మరొకరికి డబ్బులు పంపితే తిరిగి మీరు ఆ డబ్బులని పొందొచ్చు. అయితే బాధిత వ్యక్తి ఏ యాప్‌ ఉపయోగించి ఓయీ చేశారో అదే యాప్‌ లో ఫిర్యాదు చేయాలి. ఇక ఏయే యాప్స్ వాళ్ళు ఎలా ఫిర్యాదు చెయ్యాలనేది చూద్దాం.

కస్టమర్ కేర్ నుంచి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ పేటీఎం లేదా ఫోన్ పే నుండి మీరు ట్రాన్సక్షన్స్ చేసినట్టయితే. ఇలా మీ సమస్య పరిష్కరించకపోతే డిజిటల్ లావాదేవీల కోసం RBI ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను మీరు కాంటాక్ట్ చెయ్యచ్చు. UPI, భారత్ క్యూఆర్ కోడ్, ఇతర చెల్లింపు లావాదేవీల సమయంలో సమస్య వస్తే RBI ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌కి కంప్లైంట్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news