జీర్ణశక్తి బాగుండాలంటే తప్పక ఈ పండ్లను తీసుకోండి..!

-

చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉంటారు మీరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉంటారా…? అయితే కచ్చితంగా ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ చిట్కాని కూడా చూడండి. చాలామంది జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడానికి వివిధ పద్ధతులని అనుసరిస్తూ ఉంటారు. అయితే జీర్ణ శక్తిని మెరుగుపరచుకోవాలంటే డైట్ లో వీటిని తీసుకుంటూ ఉండండి. వీటిని కనుక మీరు మీ డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మరి జీర్ణశక్తిని మెరుగుపరచుకోవడానికి ఎటువంటి పండ్లని డైట్ లో తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఆపిల్

ఆపిల్స్ లో ఎంజైమ్ కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలానే పెద్ద పేగుల్లో మంట వంటివి రావు.

జామ

జామ ని కూడా జీర్ణశక్తిని మెరుగుపరచుకోవడానికి తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య నుండి కూడా ఇది బయట పడేస్తుంది.

బొప్పాయి

ఇందులో ఉంటే ఎంజాయ్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపునొప్పి కూడా రాదు.

అరటిపండు

అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అలానే ఫైబర్ కూడా ఉంటుంది జీర్ణశక్తిని మెరుగుపరచడానికి అరటి పండ్లు కూడా హెల్ప్ అవుతాయి.

బీట్రూట్

బీట్రూట్ లో ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి అలానే పొటాషియం కూడా ఉంటుంది బీట్రూట్ ని తీసుకుంటే కూడా జీర్ణక్రియని మెరుగుపరుచుకోవచ్చు.

కివి

కివి కూడా మనకి జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది మీరు ఆహారం తీసుకున్నాక కివి ని తింటే చాలా మంచిది. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది.

బెర్రీస్

వీటిని కూడా తీసుకోండి. బెర్రీస్ లో కూడా చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి వీటిని తీసుకుంటే జీర్ణశక్తి కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news