ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికే గ్రాట్యుటీ

-

ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపుల కోసం కనీస అర్హత పరిస్థితిని సడలించడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రాట్యుటీ అర్హత ప్రమాణాలను తగ్గించాలని పెరుగుతున్న డిమాండ్ మధ్య ఐదేళ్ల నిరంతర ఉపాధి నుండి ఒకటి మరియు మూడు సంవత్సరాల మధ్య స్థాయిని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.

కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఇటీవల ప్రవేశపెట్టిన నివేదికలో, ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు కోసం ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల నిరంతర సేవను ఒక సంవత్సరానికి తగ్గించాలని సిఫారసు చేసింది.

ఐదేళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు చెల్లించే గ్రాట్యుటీ కాలాన్ని తగ్గించే విధంగా కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక ముందడుగు వేసింది.

ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఈ గ్రాట్యుటీ పరిమితులు ఉన్నాయి. భారత్ లో మొన్నటి వరకు 10 లక్షల రూపాయలు గ్రాట్యుటీ పరిమితిఉండేది. అయితే ఏడవ వేతన సవరణ చట్టం అమలు తర్వాత ఆ పరిమితిని 20 లక్షలకు పెంచారు. మొత్తానికి కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిమితుల కారణంగా కంపెనీ ఉద్యోగులను అర్థాంతరంగా తొలగిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని కమిటీ ఈ విధమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

1972 లో కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్‌ను రూపొందించింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీ ఉద్యోగులకు గ్రాట్యుటీని చెల్లించాల్సిందే. యాక్ట్‌లోని నిబంధనలు సంస్థలు, ఉద్యోగులకు వర్తిస్తాయి. అయితే.. గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థలో కనీసం 5 ఏళ్ల సర్వీస్ చేసి ఉండాలి. అలా అయితేనే గ్రాట్యుటీకి అర్హత సాధిస్తారు. సంవత్సరం సంవత్సరానికి జాబ్ మారే వాళ్లకు మాత్రం గ్రాట్యుటీ అందని ద్రాక్షే.

కార్మిక సంఘాలు  ఆరోపిస్తూ ఉన్నది ఏమిటంటే…. చాలా సంస్థలు కావాలని కొంత మంది కార్మికులను చెల్లించవలసి వస్తుందని గ్రాట్యుటీ సమయం కన్నా ముందే ఖర్చు తగ్గించుకునేందు ఉద్యోగం నుండి తీసి వేస్తున్నారని…. కాబట్టి గ్రాట్యుటీ చెల్లించడానికి పనిచేయాల్సిన నిర్ధిష్టమైన కాలపరిమితిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు సంవత్సరాలకి నమ్మకంగా పనిచేసిన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ మొత్తాన్ని 1 నుండి 3 సంవత్సరాల లోపు పని చేసిన తర్వాతే వచ్చేలాగా చట్ట సవరణ చేయాలని కోరారు.

దశాబ్దాల క్రితం ఒకే సంస్థలో ఎక్కువ సంవత్సరాలు పనిచేసే వెసులుబాటు, పరిస్థితులు ఉండేదని…. కానీ ఇప్పుడు కాలం మారిందని… ప్రస్తుత నిజజీవితంలో ఇది సాధ్యపడే అవకాశాలు లేవని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ‘జీనియస్ కన్సల్టింగ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్.పి యాదవ్ అభిప్రాయ పడ్డాడు. కాబట్టి కాలపరిమితిని దాదాపు ఒక సంవత్సరానికి తగ్గించడమే మంచిదని…. ఒక సంవత్సరం కుదరకపోతే కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు తగ్గించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ముందు గ్రాట్యుటీ కాలపరిమితిని తగ్గించేందుకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి అన్నీ శాఖలను కలిపి ఒకేసారి ఒక సంవత్సరం లేదా రెండు నుండి మూడు సంవత్సరాలకు ఆ కాలపరిమితిని తగ్గించడం లేదా ఒక్కో శాఖకు ఒక్కోసారి వారి నైపుణ్యత, అభివృద్ధి, కార్మిక కష్టాన్ని పరిగణలోకి తీసుకొని దశలవారీగా తగ్గించడం.

అలాగే వీటిలో ప్రో-రాటా గ్రాట్యుటీ అని కూడా ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఒక కార్మికుడు తన ఒప్పందం చేసుకున్న పూర్తి కాలాన్ని ఆ సంస్థకు కేటాయించినట్లయితే కాంట్రాక్టర్లు ఈ మధ్యలో ఎంతమంది మారినా కూడా అతనికి మొట్టమొదటి ఉద్యోగం కల్పించ్చిన వ్యక్తే కాంట్రాక్టు ప్రకారం ఈ గ్రాట్యుటీ అతనికి వేతనంతో పాటు నిర్దిష్ట కాలం పూర్తయిన తర్వాత చెల్లించవలసి ఉంటుంది. ఈ గ్రాట్యుటీ పై కూడా కాలపరిమితిని తగ్గించే అవకాశాలు మెండుగా ఉన్నాయు.

 

Read more RELATED
Recommended to you

Latest news