గుడ్‌న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు

-

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దేశంలో అధికంగా వినియోగంలో ఉన్న సన్‌ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో ఈ రెండు ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్ డ్యూటీ, అగ్రిసెస్‌ను మినహాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటన జారీ చేసింది. ఆకాశాన్నంటిన వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. దీంతో రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

సన్‌ప్లవర్ ఆయిల్
సన్‌ప్లవర్ ఆయిల్

ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు, మరో 20 లక్షల టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటివరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం తొలగించింది. 2022-23, 2023-42 ఆర్థిక సంవత్సరంలో సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18వ తేదీలోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. అలాగే పంచదార ధరలు పెరగకుండా ఉండేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ఈ మేరకు చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news