ఎప్పటికప్పుడు తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ…సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది…ఊహించని విధంగా రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇప్పటికే పదునైన వ్యూహాలతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేలా బీజేపీ ముందుకెళుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి బాగా కలిసొస్తుంది. ఆ అధికార బలమే…తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడేలా ఉంది.
మొత్తానికి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అయితే బీజేపీ రాజకీయాలని గాని, వ్యూహాల్లో గాని ఎలాంటి లోపాలు లేవు…ఎలాగైనా బలపడటమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. అయితే అంత ఈజీగా తెలంగాణలో పార్టీ బలపడిపోయి…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని దాటేసి అధికారం దక్కించుకోగలదా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ బలంతో ఉన్న పార్టీ టీఆర్ఎస్…పైగా అధికారంలో ఉంది. ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది…క్యాడర్ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం గాని, క్యాడర్ గాని ఉంది. కాకపోతే అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతవుతుంది.
అలా అని ఆ పార్టీని తక్కువ అంచనా వేయకూడదు…ఎప్పుడైనా ఆ పార్టీ పుంజుకోవచ్చు..ఎందుకంటే ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం లేదు. ఇక టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు ఉన్నట్లు బీజేపీకి క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలం లేదు. ఇప్పుడు ఆ బలం పెంచుకోవడమే బీజేపీ ముందున్న తక్షణ కర్తవ్యం..ఆ బలం పెంచుకోకుండా బీజేపీ ఎంత కష్టపడిన ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రధాన నేతలంతా…క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడంపైనే ఫోకస్ పెట్టారు. అది కూడా టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల బలంపై దృష్టి పెట్టారు.
అంటే కింది స్థాయిలో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని, కార్యకర్తలని బీజేపీలోకి ఆకర్షించే పనిలో పడ్డారు. బలమైన నాయకులని పార్టీలో చేర్చుకుని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని లాగితే ఆటోమేటిక్ గా కార్యకర్తలు కూడా వస్తారు. అందుకే ఇప్పుడు కమలం పార్టీ…కారు-కాంగ్రెస్ బలంపై ఫోకస్ పెట్టి…తమ బలం పెంచుకోవాలని చూస్తుంది.