జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టాయి అన్న విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేదాన్ని పొందుపరిచి ప్రజలందరినీ ఆకర్షించే విధంగా మానిఫెస్టోలో సిద్ధం చేసి విడుదల చేస్తున్నాయి. ఇక ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.
ముఖ్యంగా ఈ మానిఫెస్టోలో వరదబాధితుల ఉద్దేశిస్తూ పలు హామీలను పొందుపరిచింది కాంగ్రెస్. వరదల కారణంగా చనిపోయిన కుటుంబాల ఇంటికి కూడా 25 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని అంతేకాకుండా… ఇల్లు దెబ్బ తిన్న వారికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు సహాయం అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది కాంగ్రెస్. అంతేకాకుండా ఎంఎంటీఎస్ రైళ్లలో దివ్యాంగులు మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులకు 50 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని హామీ ఇచ్చారు.