బీజేపీ గెలిస్తే.. సర్జికల్ స్ట్రైక్ చేసి వారిని తరిమి కొడతాం : బండి సంజయ్

-

గత కొంతకాలం నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు బండి సంజయ్ ఇక ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే హబ్సిగూడ లో ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేసి రోహింగ్యాలను పాకిస్తాన్ వాళ్లను తరిమి తరిమి కొడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు హైదరాబాద్లో జరగాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇటీవలే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తారు అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారగా ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news