ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు జగన మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత సంవత్సరం నవంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ సబ్ సీడీ చేయనున్నారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తూ రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లిస్తూ జగన్ సర్కార్ ముందుకు సాగుతోంది.
ఇందులో భాగంగానే… 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.542.06 కోట్లను జమ చేయనున్నారు సీఎం వైయస్ జగన్. అలగే.. వైయస్ఆర్ యంత్ర సేవా పథకం క్రిం ద 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్లను జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612.62 కోట్ల నష్టపరిహారం అందించింది.