మత ప్రార్ధన చేస్తే కరోనా రాదు… నెల్లూరులో వేల రూపాయలు వసూలు…!

-

జనాల్లో మూఢ నమ్మకాలు ఉన్నన్ని రోజులు కూడా ఎన్ని విధాలుగా కావాలి అంటే అన్ని విధాలుగా ఆడుకుంటారు కొందరు. కరోనా వైరస్ విషయంలో కొన్ని మతాలకు రాదు కొన్ని మతాలకు మాత్రమే వస్తుంది అనే ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క ప్రజల ప్రాణాలు పోతున్నా సరే పదే పదే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కొంత మంది గుండు చేయించుకుంటే కరోనా రాదని ప్రచారం చేసారు.

దీనితో అదిలాబాద్ జిల్లాలో కొందరు కుల దైవానికి పూజలు నిర్వహించారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక పత్రిక కథనం ఆధారంగా… నెల్లూరు జిల్లాలో ఏఎస్‌పేటలోని ఖాజా రసూల్‌ దర్గాలో కొందరు వ్యక్తులు రాత్రివేళ్లలో దొంగచాటుగా సామూహిక ప్రార్థనలు చేసినట్టు గుర్తించారు.

ఒక ఛానల్ నిఘాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన మతానికి కరోనా వచ్చే అవకాశం లేదని కొత్త శక్తులు వస్తాయని ప్రచారం చేస్తూ హఫీజ్‌ పాషా అనే వ్యక్తి దర్గా వెనుకవైపు నుంచి ప్రతి రోజు 50 మందిని దర్గాలోకి పంపించి పంపి ప్రార్థనలు, పూజలు చేయిస్తున్నారని ఛానల్ గుర్తించింది. ఇందుకోసం వేల రూపాయలను వసూలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news