రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..రబీ వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేత

-

తెలంగాణ రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రబీ వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రానున్న రబీ సీజన్ లో వరి సాగు పై ఎలాంటి ఆంక్షలు విధించకూడదనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో వరి ధాన్యం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

కేంద్రం విధించిన నిబంధనలతో వరిని సాగు చేయకూడదని రాష్ట్రం ప్రకటించింది. దీంతో రాజకీయంగా పెద్ద రచ్చ కొనసాగింది. అయితే అంతర్జాతీయంగా ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో సాగుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా గత ఏడాది రబీ వరి సాగుపై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్రం ధాన్యం కొనకపోవడంతో.. కేసీఆర్‌ సర్కార్‌ కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news