అక్షయ తృతీయలోపు ఇంట్లో నుంచి ఈ వస్తువులను తీసెయ్యండి.. అదృష్టం పడుతుంది..

-

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22 ఉదయం 7:49 గంటలకు ప్రారంభమవుతుంది..ఏప్రిల్ 23 ఉదయం 7:45 గంటలకు ముగుస్తుంది. ఈ అక్షయ తృతీయను ఏప్రిల్ 22న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ.మత విశ్వాసాల ప్రకారం, ప్రజలు ఈ రోజున బంగారం, వెండిని కూడా కొనుగోలు చేస్తారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, సనాతన ధర్మానికి చెందిన వారు వివిధ రకాల మంత్రాలను పఠిస్తూ ఆధ్యాత్మిక కార్యాలను కూడా చేస్తారు, అయితే జ్యోతిష్యం చెప్పిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, విష్ణువు లక్ష్మీదేవి సంతోషంగా ఉంటారు.. అదృష్టం వరిస్తుంది.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..

అక్షయ తృతీయ రోజున, వివిధ రకాల మంత్రాలు జపిస్తారు. అన్ని ఆధ్యాత్మిక కార్యాలు విష్ణువు, లక్ష్మీదేవి సంతోషం కోసం చేస్తారు. ఈ రోజున ప్రజలు కొత్త వాహనాలు, ఆభరణాలు, బంగారం, వెండి కొనుగోలు చేస్తారు, అయితే అక్షయ తృతీయ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు విరిగిన చెప్పులు ఇంట్లోంచి బయట పడేయాలి.చీపురు బయటకి విసిరేయాలి. విరిగిన దేవతామూర్తుల విగ్రహాలను పారద్రోలాలి, ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది..ఎటువంటి వస్తువులను వెంటనే తీసివేయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

*. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఉంచిన విరిగిన చీపురు బయట పడేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి అనుగ్రహం లభించడమే కాకుండా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు.

*. ఇంట్లో ఉంచిన చిరిగిన చెప్పులను బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుంది.

*. అంతే కాకుండా ఇంట్లో ఉంచిన విరిగిన పాత్రలను కూడా అక్షయ తృతీయ రోజున బయటకు తీయాలి. విరిగిన పాత్రలు ఇంట్లో ప్రతికూలతను తెస్తాయి. ఈ కారణంగా కుటుంబంలో అశాంతి వ్యాపిస్తుంది. లక్ష్మీ ఇంట్లో ఉండదు..

*. మత విశ్వాసాల ప్రకారం, అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేయాలి, చెత్తను డస్ట్‌బిన్‌లో ఉంచాలి..

*. మీ ఇంట్లో మొక్కలు ఉండి అవి ఎండిపోతుంటే వాటిని భూమికింద ఉంచి మొక్కలకు నీరు పోయండి.ఎండిన మొక్కలు ఇంట్లో వాస్తు దోషాలను కలిగిస్తాయి. దీంతో లక్ష్మీదేవి ఆగ్రహం ఉంటుంది.అందుకే వెంటనే తీసివేయ్యండి..

ఇవన్నీ అక్షయ తృతీయ కన్నా ముందే చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news