టైగర్ నాగేశ్వరరావు చిత్రం నుంచి రేణూ దేశాయ్ లుక్

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం టైగర్‌ నాగేశ్వర రావు . నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 1970లో స్టూవర్టుపురానికి చెందిన‌ గ‌జ‌దొంగ టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అక్టోబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఓ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో ఆమె నటిస్తున్నారు. రేణూ దేశాయ్ పాత్రకు సంబంధించిన లుక్ ను చిత్రబృందం నేడు పంచుకుంది. కాగా, టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ ను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబయిలో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దసరా సీజన్ లో అక్టోబరు 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. అంతేకాదు, రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version