ఒకప్పుడు పచ్చబొట్టు.. ఇప్పుడు టాటూ అనుకుంటారు..కానీ రెండింటికీ చాలా తేడా ఉంది.. చాలామంది పచ్చబొట్టు, టాటూ ఒకటే అనుకుంటారు. టాటూ వేసేప్పుడు అందులో కెమికల్స్ కలుపుతారు.. ఇంకా మిషన్ సాయంతో వేస్తారు.. అదే పచ్చబొట్టును ముద్రిస్తారు.. ఇది నొప్పి విపరీతంగా ఉంటుంది. మన పెద్దోళ్ల కాలంలో పచ్చబొట్టులు వేపించుకుంటే.. కాలం మారేకొద్ది.. ఇప్పుడు పచ్చబొట్టు స్థానంలో టాటూలు వచ్చాయి. యూత్ అంతా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో టాటూ కూడా ఒక భాగం అయింది. అయితే టాటూలపై జరిగిన తాజా అధ్యయనాలు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాయి.. అదేంటంటే..
టాటూల ఇంక్‌పై చేసిన అధ్యయనాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాటూల కోసం ఉపయోగించే ఇంక్‌ల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనంగా మారే పదార్థం ఉందని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు 100 టాటూ ఇంక్‌లను విశ్లేషించారు. టాటూలు ఎప్పటికీ తొలిగి పోకుండా శరీరంపై ఉండడానికి ఇంక్‌లలో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్ కారణం.
శాస్త్రవేత్తలు విశ్లేషించిన 100 ఇంక్‌ల్లో 23 ఇంక్‌ల్లో అజో అనే పదార్థం కలిగిన రంగు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా అజో సింథటిక్ రంగులను ఆహారం, బ్యూటీ, దుస్తుల తయారీలో వాడతారు. ఇవి రసాయనికంగా చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు సురక్షితంగానే ఉంటాయి.. కానీ, బ్యాక్టీరియాతో, లేదా యూవీ కిరణాలు, అధిక సూర్యరస్మి తగిలితే క్యాన్సర్ కలిగించే సమ్మేళనంగా మారుతాయని అధ్యయనంలో వెల్లడైంది. టాటూ వేసే సమయంలో పరికరాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే చర్మం చీలడం, కామెర్లు వంటి రక్తంతో సక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
టాటూలోని అజో సమ్మేళనాలు ఎక్కువ ఎండకు ఎక్స్‌పోజ్ అయినా, అధిక బ్యాక్టీరియాకు గురైనా ‘క్యాన్సర్ కారకంగా’ మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి.. టాటూ వేసుకునే ఆలోచనలో ఉన్నవాళ్లు ఓ సారి ఆలోచించండి.. ఎండలోకి వెళ్లినప్పడు సన్ స్ర్రీన్ లోషన్ అయినా రాసుకుంటాం కానీ టాటూ మాత్రం వేయించుకుని తీరుతాం అంటారా..?