ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుకు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుంచే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించే సందర్భంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ను కూడా పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కాగ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ విషయంలో గందరగోళ పరిస్థితులు నెల కొన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో నేడు ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం జగన్ సమావేశం కానున్నారు. దీంతో రాష్ట్రంలో పీఆర్సీ రగడ పై ఓ కొలిక్కి రానుంది.