రేవంత్ కోసం రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం…!

-

వారం రోజులుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మంత్రి కెటీఆర్ ఫా౦ హౌస్ ను అనుమతి లేకుండా డ్రోన్ కెమరాతో చిత్రీకరించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు.

మరో పిటిషన్‌లో మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని కోరారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందు వలన తను హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులను అన్నింటినీ కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ బృందం వాదించనుంది.

రేవంత్ రెడ్డికి అండగా కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకుని ఆయన మీద ఉన్న కేసులను వాదించేందుకు సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందాన్ని హైదరాబాద్ పంపినట్లు తెలిసింది. ఇప్పటికే లాయర్లు హైదరాబాద్ చేరుకుని కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలతో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ డ్రోన్ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news