రేవంత్: సంచాలక్ గా మీరు అస్సలు పనికి రారు..!!

-

 బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు చేపిస్తున్నాడు.

ఇక ఎప్పుడూ కూల్ గా ఉండే రోహిత్ కూడా హౌస్ లో హంగామా చేశాడు.ఇక ఫైనల్ టిక్కెట్ కోసం అడించే గేమ్ లో కొంత మందిని సంచాలకులు తీసేశారు. ఇక దానిపై రోహిత్‌ అయితే నా వల్ల ఫైమాను తొలగించా మంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్‌ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. మీరు ఏమైనా మేధావులా, దాన్ని  మీరెలా డిసైడ్‌ చేస్తారని వారితో గొడవ పడ్డాడు.

ఇక హౌస్ లో ఉన్న యాంగ్రీ యంగ్ మాన్ రేవంత్‌ కూడా విజ్రంబించాడు సంచాలకులు గా మీరు ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్‌ రెచ్చిపోయాడు.అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్ లో రేవంత్‌ గెలవగా శ్రీహాన్‌, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. రెండోవ రౌండ్ అయ్యే సరికి రేవంత్‌ 15, శ్రీహాన్‌, ఆది 14, ఫైమా 7, రోహిత్‌ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు మరో ఛాలెంజ్ పెట్టగా అందులో శ్రీహాన్‌ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్‌, శ్రీహాన్‌ టికెట్‌ టు ఫినాలే రేస్‌ కోసం పోటీపడ్డారు. ఇందులో ఫైనల్ కు వెళ్ళేది శ్రీ హన్ అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news